Sunday, April 28, 2024
- Advertisement -

వివేకా హత్య కేసు : చేతులెత్తేసిన సీ.బీ.ఐ.. నెక్స్ట్ ఏంటి ?

- Advertisement -

ఏపీలో 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పెను సంచలనంగా మారిన సంగతి విధితమే. ఈ హత్య జరిగి మూడేళ్లు పూర్తి కావొస్తున్న ఇంతవరకు ప్రధాన నిందితులెవరనేది మిస్టరీగానే ఉంది. మొదటి సిట్ అధికారుల నుంచి ఇప్పుడు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ వరకు.. అధికారులు మారుతున్నప్పటికి కేసు మాత్రం ముందుకు కదలడం లేదు. వివేకా హత్య చుట్టూ ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయని, పక్క పథకం ప్రకారమే వివేకా హత్య జరిగిందని మొదటి నుంచి ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. హత్య జరిగే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలో ఉన్నారు.

కాగా దర్యాప్తు విషయంలో ప్రభుత్వంపై అలాగే ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం అధికరంలోకి వచ్చాక కూడా వైఎస్ జగన్ ఎందుకు తన బాబాయ్ హత్య కేసు విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనేది అందరి నోళ్ల నుంచి ప్రధానంగా వినిపించే ప్రశ్న. ఇక తన తండ్రి హత్యలో నిందితులను బయటకు లాగేందులు వివేకా కూతురు సునీత రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కేసు విషయమై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులను సాక్షులు బెదిరింపులకు పాల్పడుతున్నారని సుప్రీం కోర్టు ముందు వాపోయింది సీబీఐ.

అంతే కాకుండా ఏపీ పోలీసులు నిందితులు కుమ్మకయ్యారని అందుకే దర్యాప్తు ముందుకు సాగడం లేదని కూడా స్పష్టం చేసింది సీబీఐ దాంతో ఈ కేసు విషయమై దర్యాప్తు ను పక్క రాష్ట్రనికి బదలి చేయాలని వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు కూడా ఆమె వినతికి అంగీకారం తెలపడంతో మరొకసారి వివేకా హత్యకేసు హాట్ టాపిక్ గా మారింది. మరి ఏ రాష్ట్రనికి ఈ కేసును బదలిచేస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. ఇతర రాష్ట్రనికి చెందిన అధికారులు దర్యాప్తు చేపట్టడం వల్ల కేసు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో సంచలనంగా మారిన తన బాబాయ్ వివేకా హత్యకేసు. పట్ల.. ఎన్నికల ముందు హడావిడి చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక సైలెంట్ గా ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -