- Advertisement -

పోకే మాన్ ప్రమాదం ..

- Advertisement -

పోకే మాన్ గో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పోకే మాన్ క్యారెక్టర్ లని వెతుక్కుంటూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటే ఇంతగా జనాలు దీనిని అడిక్ట్ అయిపోయారా అనియా ఆశ్చర్యం వేస్తుంది.

పోకేమాన్ క్యారెక్టర్ లని సేకరించాలి అనే ఆత్రుత లో కారు నడుపుతూ కూడా ఈ గేమ్స్ ఆడేస్తున్నారు కుర్రకారు. స్కూలు విద్యార్ధులు ఎక్కువగా ఆడే ఈ ఆట ఇప్పుడు ఎన్నో అనర్ధాలు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు ఒక కుర్రాడు స్టీరింగ్ వీల్ ని వదిలేసి పోకేమాన్ ఆడుతో ఏకంగా స్కూల్ ని గుద్దేసాడు. ఆ కారు క్లాస్ రూమ్ లోకి దూసుకుని వెళ్లి స్థానికంగా సంచలనం సృష్టించాడు ఈ కుర్రాడు. ఇంత కష్ట పడినా కూడా ఆ కుర్రాడికి పోకేమాన్ క్యారెక్టర్ మాత్రం దొరకలేదు.

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ – బెర్విక్ పట్టణం లో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఒక పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉన్న కుర్రాడు కారులో పోకేమాన్ ఆడుతూ కారు నడుపుతున్నాడు. ఆడుతూ ఆడుతూ ఆటలో లీనం అయిపోయి తాను కారు నడుపుతున్న విషయం మర్చిపోయాడు. దాంతో కారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కాలేజ్ ఆవరణలోకి దూసుకెళ్లింది.

అదృష్టవశాత్తూ ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. కాగా మెల్ బోర్న్లోని మెర్విక్ పట్టణంలో పోకెమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేయొద్దు అంటూ ఎలక్టనిక్ సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారట! ఈ బోర్డులు ఏర్పాటు చేసిన రోజుల వ్యవధి లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

Also Read

  1. పోకేమాన్ గేమ్ పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
  2. ఆరో క్లాస్ పిల్లలు లేచిపోయారు ..
  3. చైతూ -సమంత ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే?
  4. యువ‌త‌పై బ్లూ ఫిల్మ్ ఎఫెక్ట్‌
  5. స్టూడెంట్ తో ఎఫైర్ పెట్టుకున్న టీచర్! ఊహించని ట్విస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -