Wednesday, May 15, 2024
- Advertisement -

భుమా నాగిరెడ్డి అరెస్ట్

- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులను దూషించారని నంద్యాల ఎమ్మెల్యే బూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేసి నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థతి నెలకొంది.

భూమాని అరెస్ట్ చేసి తీసుకెళుతున్న వాహనాన్ని వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్త్లకు మధ్య తోపులాట జరిగింది.  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పోలీస్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

పోలీంగ్‌ కేంద్రానికి వచ్చిన అఖిలప్రియ ఓటు వేయకుండా తన తండ్రి భూమా నాగిరెడ్డి కోసం వేచి చూశారు. దీనిపై పోలింగ్‌ అధికారులు, పోలీసులు అభ్యంతరం తెలిపారు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవాలని సూచించారు. ఇందుకు అఖిల ప్రియ నిరాకరించడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. భూమా నాగిరెడ్డి సైతం అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగి పోలీసులని ధూషించారని సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -