Thursday, May 9, 2024
- Advertisement -

ఎంత సేపు సెలబ్రీటీలేనా! మిగాతా వారు కనిపించరా?

- Advertisement -

నిన్న అర్ధరాత్రి  రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో సినీ నటి, బిజెపి ఎంపి హేమమాలిని ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమమాలినికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనలో నాలుగేళ్ళ చిన్నారి  అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

ఏ టీవీ ఛానల్స్‌లో చూసినా బాలివుడ్ డ్రీమ్ గర్ల్‌కి గాయాలయ్యాయి. ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విజువల్స్ మాత్రమే వస్తున్నాయి. మరో కారులో ఎవరు ఉన్నారనేది మాత్రం మర్చిపోయారు. అదే యాక్సిడెంట్‌లో ముక్కు పచ్చలారని నాలుగేళ్ళ చిన్నారి సోమ గురించి ఎక్కడా ఊసే లేదు. ఆ చిన్నారి తల్లి దండ్రులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరి వీరి సంగతేంటి. ఆమె తలకు చిన్న గాయం అయితేనే మొదటి పేజీలో వార్త వేశారు. రాత్రి యాక్సిడెంట్ జరిగిన వెంటనే హేమమాలినికి గాయాలైన ఫోటోలు సోషల్ నెట్ వర్క్‌లోకి వచ్చాయి. ఈ ఫోటోలో ముద్దు ముద్దుగా కనిపిస్తున్న చిన్నారి ఫోటో మాత్రం రాలేదు. 

ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తేమి కాదు. 2002 సెప్టెంబరు 28వ తేదీన రాత్రి పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్నవారిపైకి సల్మాన్ కారు దూసుకెళ్ళిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారి గురించి కానీ గాయాలపాలయిన వారిని పట్టించుకున్న వారు లేరు. ఎంతసేపు సెలబ్రీటీలే తప్ప  మిగతా వారు కనిపించరా..!  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -