Sunday, May 12, 2024
- Advertisement -

లావా వారి ఆండ్రాయిడ్ వ‌న్

- Advertisement -

గూగుల్ ఆండ్రాయిన్ వ‌న్ స్మార్ట్  ఫోన్ మొద‌టి బ్యాచ్ ను ఎంతో అట్ట‌హాసంగా అప్ప‌ట్లో లాంచ్ చేసిన‌ప్ప‌టికీ…దానికి ఇండియాలో ఆద‌ర‌ణ క‌రువైంది. క‌రెక్ట్ వేలో ఆండ్రాయిడ్ వ‌న్ ను గాడ్జెట్ ల‌వ‌ర్స్ కు చేర‌వేయ‌డంలో గూగుల్ ఫెయిలైంద‌నే చెప్పాలి.

మొద‌టి బ్యాచ్ ఎండ్రాయిడ్ వ‌న్ స్మార్ట్ ఫోన్స్ వ‌చ్చే టైమ్లో ఏ ఇండియా లోక‌ల్ కంపెనీ వీటి త‌యార‌రీ కి ముందుకు రాలేదు. స‌రిగ్గా ఇంత‌కాలానికి మ‌న లావా ముందుకు రావ‌డంతో గూగుల్ ఆ ప్రాజెక్ట్ ను లావాకు ఇచ్చింది. మ‌న లోక‌ల్ కంపెనీ లావా తో గూగుల్ టై అప్ అయింది.అందుకే కాబోలు కేవ‌లం 12వేల  రూపాయ‌ల‌కే ఆండ్రాయిడ్ వ‌న్ స్మార్ట్ ఫోన్ ను ఈనెల 14 నుంచి మన‌కు  అందిస్తుంది.లావా, మీడియాటెక్ సాయంతో కొత్త ర‌కంగా….. గూగుల్ ఆండ్రాయిడ్ వ‌న్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో త‌యారు అవుతున్నాయి.

2జిబి ర్యామ్ ,5 ఇంచ్ డిస్ ప్లే,8 మెగా పిక్సెల్ కెమేరాతో ఇది వ‌స్తోంది.ఆండ్రాయిడ్ వ‌న్ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు పికప్  కాలేదు.కొత్త‌గా వ‌చ్చే ఈ మోడ‌ల్ తో అది వ‌ర్క‌వుట్ అయ్యి తీరుతుంద‌ని గూగుల్ కంటే ఎక్కువ‌గా లావా న‌మ్ముతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -