Thursday, May 16, 2024
- Advertisement -

‘ఆ’ విషయం చెప్పడానికే గవర్నర్ ని కలిసి కెసిఆర్ ?

- Advertisement -

మళ్ళీ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్  నరసింహన్ తో తెలంగాణా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు భేటీ అయ్యారు. అసంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే గవర్నర్ వద్దకి వెళ్ళిన కెసిఆర్ వారం రోజుల గ్యాప్ లో ఇది రెండవ సారి ఆయన్ని కలవడం. 

అంతకు ముందు సరిగ్గా సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు రోజు ఆయన్ని కలిసి తరవాత రోజు నుంచీ అసంబ్లీ మొదలు పెట్టారు. ఇంత తరచుగా వారిద్దరూ కలుసుకోవడం వెనక ఏం జరుగుతోంది అనేది మీడియా ఆసక్తి చూబిస్తోంది. గురువారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగబోతోంది. 

అసంబ్లీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజు నుంచీ శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే క్యాబినెట్ లో మార్పులూ చేర్పులూ చెయ్యబోతున్నారు అని ఆ మార్పులు ముందుగా గవర్నర్ కి తెలియపరిచారు అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. 

ఈ మధ్యన మంత్రి వర్గ అనుచరులు కొందరి మీద కెసిఆర్ సీరియస్ గా ఉన్నారు. అసంబ్లీ సమావేసాలు కూడా అయిపోవడం తో ఇది వరకు తాను మాట ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కి సమయం వచ్చినట్టే అనే సిగ్నల్ కెసిఆర్ ఇస్తున్నారు కావచ్చు. ఈ ప్రక్రియ గురించి గవర్నర్ తో చర్చించడం కోసం వెళ్ళారని మీడియా లో ఒక వర్గం అంటోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -