Sunday, May 19, 2024
- Advertisement -

బాల‌య్య నిర్మాత‌ను చూశారా?

- Advertisement -

చెంగల వెంకట్రావు అంటే పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌క పోవ‌చ్చు కాని హీరో బాలకృష్ణ న‌టించిన స‌మ‌ర‌సింహ‌రెడ్డి సినిమా నిర్మాత అంటే మాత్రం అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌స్తాడు. చెంగల వెంకట్రావుకి ఎమ్మెల్యేగా కూడా చేసిన అనుభ‌వం ఉంది. 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలుపొంది, 2009 ఎన్నికల్లో ఓడిన ఆయన 2014లోనూ పరాజయం పాలయ్యారు.

అయితే అటువంటి మ‌నిషి ఈ రోజున జైలులో ఖైదీలా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి వివ‌రాల‌లోకి వెళ్తే…2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట బీచ్ మినరల్స్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఒక మత్స్యకారుడు మరణించాడు. చెంగల వెంకట్రావు మద్దతుదారులే మత్స్యకారుడిని చంపారన్న ఆరోపణ ఉంది. దీనిపై దాదాపు పదేళ్లు విచారణ జరిగిన అనంతరం చెంగల దోషిగా నిరూపితమై యావజ్జీవ కారాగారశిక్షను కోర్టు విధించింది. ఓడలు బండ్లు కావటం అంటే ఎలానో ఆయన్ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -