- Advertisement -

చంద్రబాబు ముఖ్య అతిధిగా.. షకీరా డాన్స్

- Advertisement -
Pop Star Shakira Coming For Vizag Beach Festival

వైజాగ్: ఫిబ్రవరి నెలలో వచ్చే లవర్స్ డే సందర్భంగా టీడీపీ ప్రభుత్వం వైజాగ్‌లో నిర్వహించ తలపెట్టిన లవ్ ఫెస్టివల్‌లో ఊహించని ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డాన్సర్ షకీరా డాన్స్ ప్రోగ్రం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఒక పక్క ఈ కార్యక్రమంపై బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుతో సహా పలువురు విమర్శలు చేస్తున్నా నిర్వాహకులు మాత్రం తమ పనుల్లో బీజీగా ఉన్నారు. ఈ లవ్ ఫెస్టివల్‌లో 9వేల విదేశీ జంటలు వచ్చి సందడి చేయనున్నారట.

దేశంలో ఇప్పటివరకూ గోవాలో మాత్రమే జరిగిన ఇలాంటి ఉత్సవం మళ్లీ వైజాగ్‌లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జపాన్ వంటి దేశాల్లో ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ముంబైకి చెందిన నిర్వాహకులు చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో కొలంబియాకు చెందిన షకీరా పాల్గొని అలరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొనడం మరో విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -