- Advertisement -
గుంటూరు: ఇటీవల తన కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేశ్, విపక్షాలు ఆ పని చేయడానికి ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విద్యార్ధి సమాఖ్య సభలో ఆయన ప్రసంగించారు. ఆస్తుల ప్రకటన చేసి తమ పార్టీ రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీలో ఉన్నవారంతా అవినీతి పరులేనని విమర్శించారు. నిజాయితీగా ఉంటూ నిత్యం ప్రజల కోసం పని చేసేవారిపైనే నమ్మకం ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నామా లేదా అనే దానితో సంబంధం లేకుండా టీడీపీ సేవా కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు మన పార్టీ ముందుగా స్పందిస్తోందని లోకేశ్ తన ప్రసంగంలో అన్నారు.
