పుట్టిన రోజు సందర్భంగా స్వీట్లు, చాక్లెట్లు, కేకులు పంచిన వాళ్లను చూస్తుంటాం.
కేవలం వాళ్ల పుట్టిన రోజు సందర్భంగానే తమ అభిమాన నేతల పుట్టిన రోజులను కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం మామూలే. నేతల పుట్టిన రోజులను వారి వారి అభిమానులు ఈ విధంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాన్నే చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేశారు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడి అభిమానులు. చాలా ట్రెండీగా వీరు ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేశారు.
అయ్యన్నపుట్టిన రోజు సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో ఉచితంగా ఉల్లిపాయల పంపిణీ జరిగింది. ఈ రకంగా ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడం ద్వారా ఆయన అభిమానుల్లో వార్తల్లోకి వచ్చారు. తమ అభిమాన నేత పుట్టిన రోజును ఈ విధంగా వారు వెరైటీగా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ఉల్లిపాయల ధరల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో మంత్రిగారి అభిమానులు వాటిని ఉచితంగా పంచిపెట్టారు.
