Thursday, May 9, 2024
- Advertisement -

బాబు భజనకు ఓకే… ఆ చానల్ ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్..!

- Advertisement -

తెలంగాణలో ఏబీఎన్ , టీవీ 9 వంటి చానళ్ల మీద ఆదిలో నిషేధం పడింది. తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానించారనే కారణంతో ఆ చానళ్లపై వేటు వేయించారు తెలంగాణ ప్రభుత్వం వాళ్లు.

ఈ నిషేధం అధికారికంగా జరిగింది. ఆ విషయంలో అనేక మంది జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసినా.. కేసీఆర్ ప్రభుత్వం తగ్గలేదు. అయితే చివరకు మాత్రం ఆ చానళ్లపై నిషేధాన్ని ఎత్తేశారు. మరి ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో కూడా కొన్ని చానళ్లపై నిషేధం పడింది. తెలంగాణలో ఓటుకు నోటు కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో ఏపీలో కొన్ని చానళ్లను నిషేధించారు.

ఆ చానళ్లలో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ కుటుంబానికి చెందిన సాక్షి టీవీ, ఇంకోటి ఇంకో చానల్. జగన్ చానళ్ పై అటు తిరిగి ఇటు తిరిగి నిషేధం ఎత్తిపోయింది. ఆ చానల్ కు పార్టీ అండ ఉంది కాబట్టి.. చివరకు నిషేధం  ఎత్తిపోయింది. అయితే మరో చానల్ ను మాత్రం పట్టించుకొనే నాథుడు లేకుండా పోయాడు. అయితే తాజాగా  ఆ చానళ్ పై నిషేధం తొలగిపోయింది. ఎందుకలా.. అంటే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ చానల్ అధినేతకు డీల్ కుదిరిందని సమాచారం.

ఇకపై టీడీపీకి అనుకూలంగా పనిచేస్తామనే ఒప్పందం మీద ఆ చానల్ పై నిషేధాన్ని ఎత్తివేయించారట. తమచేతిలోని కేబుల్ ఆపరేటర్లద్వారా ఆ చానల్ ను ఇన్ని రోజులూ బంద్ చేయించిన అధికార పార్టీ.. ఇప్పుడు ఆ చానల్ పై నిషేధాన్ని ఎత్తివేయించినట్టుగా తెలుస్తోంది. దీనికంతటికీ కారణం ఒప్పందమేనని టాక్. ఈ విధంగా తెలుగుదేశం అధినేత మరో చానల్ ను తన భజనకు రెడీ చేయించుకొన్నారట. మరి ఇకపై ఆ చానల్ ప్రసారాలు ఎలా ఉంటాయో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -