Saturday, May 4, 2024
- Advertisement -

రాజ‌కుమారి ల‌గ్గం వాయిదా

- Advertisement -

బ్రిట‌న్ యువ‌రాణి పెళ్లి 2020లోనే

రాజ‌భోగాలు అనుభ‌విస్తూ సుఖంగా కూర్చొని తినేంత ఆస్తి ఉన్నా ఓ సామాన్యుడిని ప్రేమించింది. త‌న ప్రేమ కోసం త‌న రాజ‌రికాన్నే వ‌దిలేసుకునేందుకు సిద్ధ‌మైంది. అలాంటి రాకుమారి వివాహం వాయిదా ప‌డింది. ఆమెనే జ‌పాన్ రాకుమారి మ‌కో. జ‌పాన్ చ‌క్ర‌వ‌ర్తి పెద్ద మ‌నవ‌రాలు మ‌కో పెళ్లి వాయిదా వేస్తున్న‌ట్లు అధికారిక వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

జపాన్ దేశంలో ఇంకా రాచ‌రికం ఉంది. జ‌పాన్ చక్రవర్తి అకిహితో పెద్ద మనవరాలు మకో. అందాల భ‌రిణెలాంటిది. మ‌కో క‌ళాశాల‌లో చదువుతున్న స‌మ‌యంలో కియ్‌ కొమురో అనే సామాన్యుడిని ప్రేమించింది. వీరి ప్రేమ విష‌యం తెలుసుకున్న రాకుమారి కుటుంబ‌స‌భ్యులు త‌మ రాజ‌రికం నిబంధ‌న‌లు వివ‌రించారు. సామాన్యుడిని ప్రేమిస్తే రాజ‌రికం వ‌దులుకోవాల‌ని చెప్పినా మ‌కో త‌న ల‌వ‌ర్‌నే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. దీంతో పెద్ద‌లంద‌రూ ఒప్పుకొని వారిద్ద‌రికీ పెళ్లి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. గతేడాది సెప్టెంబర్‌లో వీరి నిశ్చితార్థం ఘ‌నంగా జరిగింది.

అయితే ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి నిశ్చ‌యించారు. ఈ పెళ్లి ఏర్పాట్ల‌లో తాత్సారం జ‌ర‌గ‌డంతో పెళ్లినే వాయిదా వేశారు. పెళ్లిని రెండేళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు ఇంపీరియల్‌ హౌస్‌హోల్డ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఏర్పాట్లలో జాప్యం కారణంగా రాకుమారి వివాహాన్ని 2020 నాటికి వాయిదా వేస్తున్నట్లు జపాన్‌ రాజభవనం ప్రకటించింది. ‘పెళ్లి వేడుకల ఏర్పాట్లలో జాప్యం కారణంగానే మా వివాహాన్ని 2020కి వాయిదా వేస్తున్నాం’ అని రాకుమారి మకో తెలిపారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -