Wednesday, April 24, 2024
- Advertisement -

మ్యాచ్ విజ‌యాన్ని మొదటి ఆరు ఓవ‌ర్లే నిర్ణ‌యిస్తాయి…సురేష్ రైనా

- Advertisement -

టీ20 మ్యాచ్ లో తొలి ఆరు ఓవర్లే జట్టు జయాపజయాలను నిర్ణయిస్తాయని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా తెలిపాడు. జొహొన్నెస్ బర్గ్ లో నేటి రాత్రి సౌతాఫ్రికాతో ఫైనల్ టీ20 జరుగనుంది. ఇప్ప‌టికే చెరో మ్యాచ్‌ను గెలిచిన ఇరు జ‌ట్లు చివ‌రి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

తొలి ఆరు ఓవర్లలో ధాటిగా ఆడిన జట్టు లేదా? తొలి ఆరు ఓవర్లు పరుగులు నియంత్రించి, వికెట్లు తీసిన జట్టునే విజయం వరిస్తుందన్నాడు. అందుకే బ్యాటింగ్ చేసిన జట్టు తొలి ఓవర్లలో ధాటిగే ఆడేప్రయత్నం చేస్తుందని చెప్పాడు. ఇక తనపై కెప్టెన్ కోహ్లీ నమ్మకముంచడంతోనే తాను జట్టులో స్థానం దక్కించుకోగలిగానని అన్నాడు. కోహ్లీ చివరి బంతి వరకు పోరాడుతాడని, ఈ క్రమంలో కొన్ని సార్లు కఠినంగా వ్యవహరిస్తాడని రైనా తెలిపాడు. తొలి రెండు టీ20ల్లో బౌలర్లు రాణించారని చెప్పాడు. ఫినిషింగ్ బాగుంటే రెండో టీ20లో విజయం సాధించేవారమని అభిప్రాయపడ్డాడు.

తొలి ఆరు ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే భారీ స్కోరుకు ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్‌ చేసే సమ​యంలో మొదటి ఆరు ఓవర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి’ అని రైనా తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -