పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్థాన్‌కు వత్తాసు పలకుతూ పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకున్నారు. షో నుంచి దయచేయాల్సిందిగా సోనీ టీవీ సిద్ధుకు తేల్చి చెప్పింది. ఆయన స్థానాన్ని అర్చన పురన్ సింగ్‌తో భర్తీ చేసింది. కొందరు చేసిన తప్పునకు ఒక దేశం మొత్తాన్ని నిందిస్తారా? అంటూ పాకిస్థాన్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. దీనిపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరైతే సిద్ధూ పాల్గొనే ‘కపిల్ శర్మ’ కామెడీ షోను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, షోను ప్రసారం చేస్తున్న ‘సోనీ టీవీ’ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. సోనీటీవీకి ఏమాత్రం దేశభక్తి ఉన్నా సిద్ధూను ఈ షో నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్ల దెబ్బకు సోనీ టీవీ ఛానల్ సిద్దూను షోనుంచి తప్పించింది.