Friday, April 26, 2024
- Advertisement -

పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ.. గొడవ సద్దుమణిగినట్టేనా?

- Advertisement -

పంజాబ్​ కాంగ్రెస్​ కొంతకాలంగా అంతః కలహాలతో అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​.. కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్దూ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ను గాడిలో పెట్టేందుకు అధిష్ఠానం తీవ్రంగా యత్నించింది. చివరకు సిద్దూకు పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు ఆ పార్టీ మొగ్గు చూపినట్టు సమాచారం.

ఈ విషయాన్ని పంజాబ్​ కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ హరీశ్​ రావత్​ వెల్లడించారు. ‘పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ కొనసాగుతారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది’. అంటూ ఆయన పేర్కొన్నారు.అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం అమరీందర్​ సింగ్​ నాయకత్వంలోనే ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ‘పంజాబ్​ భవిష్యత్​ కోసం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ దృష్టిలో ఉంచుకోవాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి చాలా రోజులుగా ఇక్కడ విభేదాలు తారస్థాయికి చేరుతుండటంతో అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టుంది. గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్​ పార్టీ పరిష్కరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా పంజాబ్​పై దృష్టి సారించింది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు నవజ్యోత్​ సింగ్​ సిద్దూ.. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమై పలు మార్లు చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

Also Read

చిరుత వర్సెస్​ కుందేలు.. మధ్యలో అడవిపంది.. ఈ సీన్​ మామూలుగా లేదు..!

టీమిండియాకు షాక్.. ఇద్దరు ఆటగాళ్లకు పాజిటివ్?

ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు… మహా వికాస్ అఘాడీ సర్కార్ ఉంటుందా.. కుప్ప కూలుతుందా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -