Saturday, April 27, 2024
- Advertisement -

కోర్టులో లొంగిపోయిన సిద్ధూ

- Advertisement -

1988 నాటి కేసులో మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతో శుక్రవారం పాటియాలా కోర్టులో లొంగిపోయారు. తన నివాసానికి సమీపంలోనే ఉన్న కోర్టుకు… దుస్తుల బ్యాగుతో వెళ్లారు. కొందరు కాంగ్రెస్ నేతలు సైతం కోర్టు వరకు సిద్దూకు తోడుగా వచ్చారు. మెజిస్ట్రేట్‌ ముందు లొంగిపోయిన తర్వాత సిద్ధూను మాతా కౌసల్య ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన వెంటనే పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు.

అంతకుముందు సిద్ధూ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోయేందుకు తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందు వల్ల .. అభ్యర్థనపై తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది.

దీంతో సిద్దూ కోర్టులో లొంగిపోయారు. 1988లో నడి రోడ్డుపై జరిగిన గొడవలో సిద్దూ.. ఓ వృద్ధుడిపై దాడి చేయడంతో.. అతడు మరణించాడు. పలు మలుపులు తిరిగిన ఈ కేసు విచారణలో ఇటీవల సుప్రీం కోర్టు సిద్దూకు ఏడాది జైలు శిక్ష విధించింది. మరోవైపు జైలు అధికారులు సిద్దూకు ఖైదీనంబరు 241383 కేటాయించారు. మొదటిరోజు జైలులో ఆయన ఎలాంటి ఆహారం తీసుకోలేదనీ, కేవలం కొన్నిటాబ్లెట్లు మాత్రమే వేసుకున్నట్లు తెలుస్తోంది.

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

గుడ్‌ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

ఉచితాలు కొంప ముంచుతాయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -