బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో హీరోగా ఐకాన్ స్టార్.!

- Advertisement -

వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేశాడు. పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ… భవిష్యత్తులో తాను నటించే సినిమాలు… పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని.. పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో పుష్ప సీక్వెల్ మూవీతో సెట్స్‌పైకి రానున్న ఐకాన్ స్టార్ వరుసగా దర్శకులతో సమావేశమవుతున్నాడు.

కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. బోయపాటి కాంబోలో అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఉంటుందని గతంలో సోషల్ మీడియాలో జోరుగానే ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా బన్నీ ముంబైలో అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి చర్చలు జరిపాడు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరో బాలీవుడ్ మేకర్‌తో కలిసి ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఐకాన్ స్టార్ హీరోగా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు భన్సాలీ దర్శకత్వం వహించనున్నారు. ఫిలిం క్రిటిక్ రమేష్ బాల కూడా తన ట్విటర్‌లో కన్ఫమ్ చేశారు. మరోవైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతోనూ బన్నీ సమావేశమయ్యాడు. ఈ ఇద్దరూ కలిసింది కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమేనని తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి హిందీలో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. ఈ చిత్రాల తర్వాత బన్నీతో సందీప్ కాంబోలో సినిమా వస్తుందా అనేది చూడాలి.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -