- Advertisement -

‘పెద్ది’ వివాదం వేళ నటి అనసూయ సంచలన పోస్ట్..!

- Advertisement -

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఎల్లప్పుడూ సామాజిక అంశాలపై.. చిత్ర పరిశ్రమలోని మార్పులపై అత్యంత నిర్మొహమాటంగా, ధైర్యంగా తన గళాన్ని విప్పుతుందనే సంగతి తెలిసిందే. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమాలో హీరోయిన్ పాత్రను వ‌ల్గ‌ర్ గా చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వివాదం నడుస్తున్న వేళ.. అనసూయ సోష‌ల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. సినిమా అనేది కేవలం కల్పిత కథ అయినప్పటికీ.. సమాజంపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, కాబట్టి క్రియేటర్స్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా అనసూయ పాత తరం సినిమాలను గుర్తుచేస్తూ.. ఒకప్పటి కథలలో స్పష్టమైన నైతికత కనిపించేదని, హీరో పాత్రలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండేవని పేర్కొన్నారు. విలన్ పాత్రలను చూస్తే మనం జీవితంలో ఎప్పుడూ అలా అనుకరించకూడదు అనే భావన కలిగేదని.. కానీ ఈ రోజుల్లో వస్తున్న కథల్లో ఆ క్లారిటీ పూర్తిగా లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాత్రలను విపరీతంగా ఎలివేట్ చేయడం కోసం.. కమర్షియల్ హంగుల కోసం దర్శకులు స్క్రీన్‌పై గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఒక కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నప్పుడు టెక్నికల్ టీమ్ నుండి దర్శక నిర్మాతలు, నటీనటులు, చివరకు చూసే ప్రేక్షకులు కూడా అందులో కీలక భాగస్వాములేనని.. అందుకే సినిమా ఎప్పుడూ సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. సృజనాత్మకత విషయంలో వచ్చిన ఇలాంటి భేదాభిప్రాయాల వల్లే తాను గతంలో కొన్ని పాపులర్ షోల నుండి స్వయంగా వైదొలిగానని.. దానివల్ల అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు పడినప్పటికీ తన సిద్ధాంతాల కోసమే నిలబడ్డానని అనసూయ గర్వంగా చెప్పుకొచ్చారు.

సినిమాలు సమాజాన్ని ఏదో పర్ఫెక్ట్ మార్గంలో నడిపించాలని మనం ఆశించలేమని.. అలాగని సమాజంపై అవి ఎలాంటి ప్రభావం చూపవని చేతులు దులుపుకోవడం కూడా ముమ్మాటికీ తప్పేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ప్రేక్షకులు ముందుకు వచ్చి సినిమాల్లో పాత్రలను చూపించే విధానాలను, అందులోని అసభ్యతను ప్రశ్నిస్తూ విమర్శనాత్మకంగా ఆలోచించడాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అవసరమైనప్పుడు కథల్లోని తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదు.. అది సమాజంలో అవగాహన పెంచడం మాత్రమేనని ఆమె విశ్లేషించారు.

చివరగా తాను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదని.. ఈ మొత్తం సినీ వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే తన ముఖ్య ఉద్దేశమని అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఇకనైనా పరిశ్రమలోని క్రియేటర్స్, నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆడియన్స్ అందరూ మరింత సామాజిక స్పృహతో, కమర్షియల్ విలువల కంటే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కంటెంట్‌ను క్రియేట్ చేస్తారని ఆశిస్తున్నట్లు అనసూయ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -