Thursday, May 16, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాహుబలి..

- Advertisement -

ఎప్పుడు ఏదోక వివాదం లేనిదె రాంగోపాల్ వ‌ర్మ‌కు నిద్ర‌ప‌ట్ట‌దు. త‌న ఫేస్‌బుక్ అంద‌రిపైనా వ‌ర్మ స్పందిస్తుంటారు. అది సినిమా అయినా,రాజ‌కీయ మైనా ఏదైనా స‌రే వ‌ర్మ పోస్ట్ పెడితె చాలు అది ఎప్పుడూ వైర‌ల్ అవుతూనె ఉంటుంది. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డిపై త‌న ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్  ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, అతనో ‘బాహుబలి’ వంటి వ్యక్తని దర్శకుడు రాంగోపాల్ వర్మ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును కొద్ది నిమిషాల క్రితం పెట్టాడు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి ‘బాహుబలి అని ‘బాహుబలి’ బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు” అని వ్యాఖ్యానించాడు. నిమిషాల్లో ఈ ట్విట్ వందలాది లైక్స్ తెచ్చుకోవ‌డంతోపాటు వైర‌ల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -