Sunday, May 19, 2024
- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా అఖిల ప్రియ‌కు గ‌ట్టిపోటీ ఉండ‌నుందా…

- Advertisement -

వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన‌ట్లే. ఇప్ప‌టికె అన్ని పార్టీలు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. వ్య‌క్తిగ‌తంగా, ఇత‌ర ప్ర‌యివేటు సంస్థ‌ల‌తో అమ అభ్య‌ర్తుల బ‌లా బ‌లాల‌పై స‌ర్వేలు నిర్వ‌హించాయి. స‌ర్వేల ఫిలితాల ఆధారంగానె టికెట్లును కేటాయించ‌నున్నారు.

వైసీపీ ప్ర‌ధానంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల‌పై గురి పెట్టింది. పాద‌యాత్ర‌లో కూడా వారినె టార్గెట్ చేయ‌నుంది. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత చంద్ర‌బాబు టీం మెంబ‌ర్‌, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే, దివంగ‌త భూమా నాగిరెడ్డి కుమార్తె.. అఖిల ప్రియ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్టాలు త‌ప్పేలా లేవ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏదోలా జ‌రిగిపోయిన‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో పొలిటిక‌ల్ సీన్‌తో పాటు ఆళ్ల‌గ‌డ్డ‌లోనూ సీన్ రివ‌ర్స్ అవుతుంద‌ని చెబుతున్నారు.

శోభానాగిరెడ్డి కారు ప్ర‌మాదంలో చ‌నిపోయిన త‌ర్వాత అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోటీ లేకుండా ఆమె కుమార్తె అఖిల ప్రియ సెంటిమెంట్ నేప‌థ్యంలో నెట్టుకొచ్చారు. దీనికితోడు టీడీపీ కూడా స‌హ‌క‌రించింది. ఆ త‌ర్వాత ప‌రిస్థితి మారిపోయింది. అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోటీ లేకుండా ఆమె కుమార్తె అఖిల ప్రియ సెంటిమెంట్ నేప‌థ్యంలో నెట్టుకొచ్చారు. దీనికితోడు టీడీపీ కూడా స‌హ‌క‌రించింది.

గెలిచిన త‌ర్వాత తండ్రీ కూతుళ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితె భూమా నాగిరెడ్డికూడా హ‌ఠాత్మ‌ర‌నం చెండంతో అనూహ్యంగా అఖిల‌ప్రియ మంత్రి అయ్యారు. అయితె వ‌చ్చె ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా ఉండ‌నున్నాయంట‌. నిజానికి ప్ర‌జాక్షేత్రంలో త‌న బ‌లం నిరూపించుకునే స్థాయికి అఖిల ఎద‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

నిజానికి ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా కుటుంబంతో పాటు.. గంగుల కుటుంబానికి కూడా పొలిటిక‌ల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్ద‌రి కుటుంబాల మ‌ధ్య‌నున్న వైరం అంద‌రికి తెలిసిందే. అలాంటి నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల‌కు గంగుల కుటుంబం నుంచి గ‌ట్టి పోటీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇప్ప‌టికె గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీగూటికి చేరుకున్నారు. మ‌రిఆ కుటుంబంనుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నెది అస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -