Friday, April 19, 2024
- Advertisement -

మళ్లీ ట్విట్టర్ లో వర్మ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

తెలంగాణకు కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ ఎలాగో అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ అలాంటి వాడని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్ చేశారు. తన సినిమాల కంటే ట్విట్లతోనే పాపులర్ అవుతున్న రాంగోపాల్ వర్మ ఈ సారి ఎన్నికల మీద ట్విట్ చేయడం విశేషం.

అమెరికా అధ్యక్షుడు ఎంతో తెలివైన బరాక్ ఒబామా మౌనం కంటే ట్రంప్ ఫూలిష్ నెస్ ఎంతో ఉన్నతమైనదని అన్నాడు వర్మ. ఇక ఇటీవలే జరిగిన అసోం ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించిన సినీ తార అంగూర్ లత ఎన్నికకావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. అంగూర్ లతా గారు మిమ్మల్ని, మీ గెలుపుని చూసి చాలా గర్వంగా ఉంది. థాంక్యూ లతా గారు, థాంక్యూ మోదీ గారు అంటూ వర్మ తన ట్విట్ లో పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలని, వైట్ హౌస్ లో ఆయన ట్రంప్ కలుసుకోవడం చూడాలని ఉందని కూడా వర్మ అన్నారు. హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న వీరప్పన్ చిత్రం విడుదల పనుల్లో వర్మ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -