Friday, May 10, 2024
- Advertisement -

రెండో జాబితా విడుదల చేసిన కేంద్రం

- Advertisement -

స్మార్ట్ సిటీల తొలి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన తెలంగాణ రాష్ట్రాల్లోని నగరాలకు రెండో జిబితాలో ఊరట లభించింది. మంగళవారం నాడు  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్మార్ట్ సిటీల రెండో జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాలో వరంగల్ నగరానికి స్ధానం దక్కింది. రెండో జాబితాలో లక్నో మొదటి స్ధానంలో ఉండగా తొమ్మిదో స్ధానంలో వరంగల్ ఉంది. స్మార్ట్ సిటీల రెండో జాబితాలో మొత్తం 13 నగరాలున్నాయి. స్మార్ట్ సిటీలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఇంతకు ముందు దేశం ఢిల్లీ నుంచి గల్లీకి వెళ్లేదని, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -