Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్నికల ఖర్చు 2, 107 కోట్లు

- Advertisement -

నిజం. కచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజం. మన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసిన ఖర్చు గురించి తెలుసుకుంటే అమ్మో.. ఇంత డబ్బా అని ఎవ్వరైనా అంటారు. 2004 సంవత్సరం నుంచి 2015 వరకూ లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో భారతదేశంలోని రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు అక్షరాల 2,107 కోట్ల రూపాయలు.

ఈ విషయాన్ని ఆ పార్టీలే ఎన్నికల కమిషన్ కు నివేదించాయి. ఈ నివేదికలను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఏడీఆర్) విస్తుపోయే ఈ వాస్తవాలను వెల్లడించింది. ఎన్నికల కమిషన్ విధించే నియమనిబంధనల్లో లొసుగులను అడ్డం పెట్టుకుని మన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. 2004 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకూ దేశంలో 71 ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చేసిన ఖర్చు 2,107 కోట్ల రూపాయలు. 2004, 2009, 2015 ఎన్నికల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెక్కుల రూపంలో వచ్చిన విరాళాలు 1,300 కోట్ల రూపాయలు కాగా, నగదు రూపంలో వచ్చిన డబ్బు 1039 కోట్ల రూపాయలు.

జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో భారీ మొత్తంలోనే విరాళాలు తీసుకున్నాయి. అంతే భారీ మొత్తంలో ఖర్చూ చేశాయి. ఈ విషయంలో దేశంలో అన్ని పార్టీల కంటే ముందున్నది సమాజ్ వాదీ పార్టీ. ఈ పార్టీకి 118 కోట్ల రూపాయలు విరాళం వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆప్ పార్టీకి వచ్చిన విరాళాలు 51.83 కోట్ల రూపాయలు. ఇందులో ప్రచారానికి ఆ పార్టీ చేసిన ఖర్చు 37.66 కోట్ల రూపాయలు. ఇక లోకసభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెక్కుల రూపంలో 86 శాతం విరాళాలు వస్తే… శాసనసభ ఎన్నికల్లో 66 శాతం విరాళాలు చెక్కుల రూపంలో వచ్చినట్లు ఈసి నివేదికలో ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -