Friday, May 3, 2024
- Advertisement -

షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన వ‌ర్మ‌….సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌

- Advertisement -

కొద్ది రోజులుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్‌ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్‌ అయిన వీడియో క్లిప్‌పై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు. ఏదో హోటల్ లో భోజనాలు వడ్డిస్తున్నారు. ‘ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా’ అంటూ ట్వీట్ చేశారు. ఎవరికైనా తెలిస్తే [email protected] మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా షూటింగ్ ను దసరా రోజున ప్రారంభిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -