Thursday, May 2, 2024
- Advertisement -

బాబుపై వ‌ర్మ ఫ‌న్నీ ట్వీట్స్‌…

- Advertisement -

ఏపీలో టీడీపీ ఘోర ఓట‌మిమై సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు వ‌ర్మ బాబుపై వ్య‌గ్యంగా సెటైర్లు వేశారు. వైసీపీ 151 సీట్ల‌తో భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.ప్రస్తుతం పరిస్థితి ఇదీ..’అంటూ ట్విట్టర్ ద్వారా ఓ సెటైరికల్ వీడియోను షేర్ చేశారు. సదరు వీడియోలో చంద్రబాబును పోలిన ఓ వ్యక్తి హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. అధికారానికి దూరమైన టీడీపీ అధినేత చంద్రబాబుపై వర్మ ఈ రకంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుద‌ల కాకుండా బాబు అడ్డుకోవ‌డంతో అప్ప‌టినుంచి వ‌ర్మ ర‌గిపోతున్నారు. ఇప్పుడు చాన్స్ దొర‌క‌డంతో త‌న దైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం సరిపోయే వ్యక్తి దొరికాడంటూ వర్మ గతంలో ఇదే వీడియోను షేర్ చేశారు. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే వీడియోను మరోసారి ట్వీట్ చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు వర్మ.

పనిలో పనిగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను అడ్డుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ రాంగోపాల్ వర్మ ఘాటు విమర్శలు చేశారు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చారు. లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్. విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు’ అంటూ మరో ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -