- Advertisement -

ఆర్ సి హెచ్ లో వీణా వాణిలకు శస్త్రచికిత్స

- Advertisement -

అవిభక్త కవలలు వీణా వాణి. పుట్టినప్పటి నుంచి వీరిద్దరు ఒకరిగానే ఉన్నారు. వీరికి ఆపరేషన్ చేసేందుకు కొందరు ముందుకు వచ్చినా ఏం జరుగుతుందోననే భయంతో అది వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఇన్నాళ్లకు ఆ చిన్నారులకు ఓ శుభవార్త. ఇది వారికే కాదు… వారిద్దరి గురించి తెలిసిన వారందరికి కూడా శుభవార్తే.

వీణావాణీలకు ఆస్ట్రేలియాలోని ప్రపంచ ప్రఖ్యాత చిన్న పిల్లల ఆసుపత్రి రాయల్ చిల్డ్రన్ హాస్పటిల్స్ (ఆర్ సి హెచ్) శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఆసుపత్రిని సందర్శించి వీణా వాణీల గురించి అక్కడి వైద్యులతో చర్చించారు.

ఈ ఆసుపత్రిలో ఇంతకు ముందు జరిగిన ఆపరేషన్ల గురించి అక్కడి డాక్టర్లు నిరంజన్ రెడ్డికి వివరించారు. అంతే కాకుండా వీణా వాణీల శస్త్ర చికిత్సకు సంబంధించి కూడా వారు ముందుకు వచ్చారు. దీనిపై మరోమారు అక్కడి డాక్టర్లతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -