- Advertisement -

షాకింగ్ః బాబుకు నోటీసులు బాబ్లీ పోరాటం చేసినందుకు కాదు…. ఆ తప్పు చేసినందుకు

- Advertisement -

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల సమయాన చంద్రబాబుకు ఒక అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ వెంటనే చంద్రబాబుతో పచ్చ బ్యాచ్ మొత్తం అలర్ట్ అయిపోయారు. మొత్తం ఇష్యూని డైవర్ట్ చేస్తూ ప్రజల కోసం పోరాడినందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారా అని నానా రచ్చా చేస్తున్నారు. ప్రజలను నమ్మించడానికి విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నిజాలు మరుగునపడెయ్యడానికి శతధా ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలు చంద్రబాబుకు ఎందుకు అరెస్ట్ వారెంట్ జారీ అయిందో తెలుసా? పచ్చ బ్యాచ్ ప్రచారం చేసుకుంటున్నట్టుగా ప్రజల కోసం పోరాడినందుకనుకుంటున్నారా? అక్షరాలా అది పచ్చి అబద్ధం. అయితే ఇష్యూ మాత్రం బాబ్లీకి సంబంధించినదే. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్లీ అనుమతులు, నిర్మాణ వ్యవహారాలు జరుగుతుంటే కళ్ళు మూసుకున్న చంద్రబాబు……….తీరా ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం తెలంగాణాలో బై ఎలక్షన్స్ కోసం బాబ్లీ పోరాటం అంటూ డ్రామా చేశాడు. అయితే ఇప్పుడు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది బాబ్లీ పోరాటం అంటూ చంద్రబాబు చేసిన హంగామా కోసం కాదు. ఆ పోరాటం అనే డ్రామా టైంలో చంద్రబాబు చాలా చట్టాలను ఉల్లంఘించారు. ఆ విషయమై అక్కడ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఒక కేసులో చంద్రబాబుకు ఇప్పటికే 22 సార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం కోర్ట్‌కి హాజరుకాలేదు. ఒక రకంగా న్యాయవ్యవస్థను దిక్కరించారు. అందుకే న్యాయవ్యవస్థ పట్ల చంద్రబాబు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ చంద్రబాబు విషయంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు చంద్రబాబు. కాంగ్రెస్ వాళ్ళు వ్యవస్థలను నాశనం చేశారు……….నేను సక్రమం చేస్తున్నా అని నిన్నా మొన్నటి వరకూ ప్రతి సభలోనూ చెప్పుకున్న చంద్రబాబుకు న్యాయవ్యవస్థ అంటే ఉన్న గౌరవం ఇది.

చంద్రబాబు కోర్టును ధిక్కరిస్తే అరెస్ట్ వారెంట్ జారీ చేయకూడదా? భారతదేశ పౌరులందరూ తనుసరించాల్సిన చట్టాలు చంద్రబాబుకు వర్తించవా? పచ్చ బ్యాచ్ దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఉండదు. కానీ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు చేసిన లొల్లిపై అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు పెడితే …..ఆ కేసుల విషయంలో కోర్ట్ ధిక్కారానికి పాల్పడ్డ చంద్రబాబుకు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయితే ఆపరేషన్ గరుడ అని చెప్పి నానా యాగీ చేయడం వచ్చు. పనిలో పనిగా బిజెపి వెనకాల జగన్ ఉండి ఇవన్నీ చేయిస్తున్నాడని ప్రజల దగ్గర మొసలి కన్నీరు డ్రామాలు ఆడడం మాత్రం వచ్చు. పచ్చ డ్రామాలకు మరోసారి ప్రజలు మోసపోతారేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -