Friday, May 10, 2024
- Advertisement -

షాకింగ్ సర్వే……. బాబుకంటే జగన్ బెస్ట్….. జగన్‌కే ఓటేస్తామన్న ఎపి ప్రజలు

- Advertisement -

తన పాలన పట్ల ఎనభై శాతం మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న బాబు మాటలు వట్టి బూటకం అని తేలిపోయింది. చంద్రబాబు పాలన యావరేజ్ అన్న వారే కేవలం 18శాతం మంది. ఇక బాగోలేదు అన్నవారు 70శాతంపైగా ఉన్నారు. అన్నింటికీ మించి చంద్రబాబును మించిన పాలకుడు లేడు, ప్రపంచానికే పాఠాలు చెప్పగలడు అని అస్తమానం భజన చేస్తూ ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని చూస్తున్న బాబు అండ్ కోని ప్రజలు అస్సలు నమ్మడం లేదు. చంద్రబాబు కంటే జగన్ సిఎం అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని 43శాతం మంది ప్రజలు తేల్చేశారు. చంద్రబాబు మళ్ళీ సిఎం కావాలని కోరుకున్నవాళ్ళు 38శాతం మంది మాత్రమే. ఇక పవన్ కళ్యాణ్ సిఎం కావాలని కోరుకున్న ప్రజలు కేవలం ఐదు శాతం మంది.

ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే మధ్యప్రదేశ్‌తో సహా త్వరలో ఎన్నికలు రాబోతున్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి కంటే ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ శాతం ప్రజల మద్దతు దక్కలేదు. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే కూడా వైఎస్ జగన్‌కే ఎక్కువ మంది ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు పాలన అస్సలు బాగాలేదని, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దని తీవ్రస్థాయిలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయడం టిడిపి నాయకులకు షాక్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థ అయిన ఇండియా టుడే సర్వేలో ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. చంద్రబాబు చెప్పుకున్న గొప్పలు, 80శాతం మంది ప్రజలు తన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్న డప్పాలన్నీ కేవలం ఉత్తరకుమార ప్రగల్భాలేనని ఎపి ప్రజలు స్పష్టంగా తేల్చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది వైకాపానే అని, వైకాపాకే మద్దతిస్తాం అని………ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబుకంటే జగన్‌ అయితేనే బాగుంటుందని ఎపి ప్రజలు స్పష్టంగా చెప్పేయడం ఇప్పుడు టిడిపి నాయకుల్లో ఆందోళన పెంచుతుంటే వైకాపా శ్రేణులు, నాయకులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -