Saturday, May 18, 2024
- Advertisement -

బిగ్ బాస్ 2పై పరుచూరి గోపాలకృష్ణ ఫైర్

- Advertisement -

ప్రముఖ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ బిగ్ బాస్ 2పై నిప్పులు చెరిగారు. భారతదేశ సంస్కృతిని, స్త్రీలను గౌరవించేలా షో ఉండాలి కానీ, మహిళలను అవమానించేలా టాస్కులు, గేమ్ లు ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. చాలా రోజులుగా ఈ అంశంపై మాట్లాడుదామని అనుకున్నా, షో ఆఖరిదశలో మాట్లాడుదామని ఆగానని చెప్పారు. ఓ అభ్యుదయవాదిగా, భారతీయుడిగా బిగ్ బాస్ షోలోని కొన్ని గేమ్స్ పై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని పరుచూరి తన పరుచూరి పలుకుల్లో చెప్పారు. స్త్రీ పురుషులు ఆకాశంలో సగం, జనాభాలో సగం. కానీ స్త్రీ, పురుషుల ఆకారంలో కానీ, శరీర నిర్మాణం, శక్తిలో కానీ ఇద్దరి మధ్య వేరు వేరు బలాబలాలు ఉంటాయి. బిగ బాస్ హౌసులో కొన్ని అంశాల్లో స్త్రీ పురుషల మధ్య పోటీ పెట్టడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కబడ్డీలో మేం గెలవలేదా ? అని స్త్రీలు అంటే నేనేం చేయలేను కానీ, వారి శరీర నిర్మాణం ప్రకారం కొన్ని ఇబ్బందులుంటాయి. ఒక పురుషుడు తమని పట్టుకుంటాడు అంటే… ఆ చేయి ఎక్కడ వేస్తాడో…అనే భయం కూడా వారిలో ఉండి ఓడిపోయే ప్రమాదముంది. స్త్రీ పురుషలను కొన్ని సందర్భాల్లో పరిగెత్తమనే టాస్కులు పెట్టినప్పుడు చూశాక కూడా బాధనిపించింది. ఆడపిల్లలు పడిపోవడం చూస్తే నాకు బాధనిపించింది. అప్పుడే మాట్లాడదామా ? అని ఆలోచించాను. కానీ గేమ్ ఆఖరిదశకు వచ్చినప్పుడు మాట్లాడదామని ఆగాను.

లేటెస్టుగా కార్ టాస్కుని తమిళ బిగ్ బాసులో తాను చూశానని చెప్పారు. కారులో ఎవరు ఓపికగా కూర్చోగలరు అని నిర్వహించినప్పుడు అక్కడ ఓ మహిళ గెలిచిందని గుర్తు చేశారు. అయితే అక్కడ ఎవరూ ఎవర్ని నెట్టుకోవడాలు వంటివి లేవన్నారు. ఇక్కడ ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలను బలవంతంగా నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంటే తనకు చాలా బాధేసిందన్నారు. క్రీడల్లో ధర్మం ఉండాలని. క్రీడాధర్మం లేనప్పుడు బలవంతుడు బలహీనుడ్ని నెట్టేసి గెలవాలనుకోవడం క్రీడాధర్మం అనిపించుకోదని స్పష్టం చేశారు. కారు టాస్కు సందర్భంగా మాట్లాడుదామనుకున్నాని చెప్పారు. కానీ అప్పుడు కూడా మాట్లాడలేకపోయానన్నారు. ఇటీవల తాను ఇంటికి వెళ్లేసరికి తన భార్య బిగ్ బాస్ చూస్తోందని. ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేస్తూ ఫొటోలు తగలబెట్టడం సీన్ చూసి దయచేసి టీవీ కట్టేయాలని తాను కోరానని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. బతికున్నవాళ్ల ఫొటోలు తగలబెట్టడం ఏం సంస్కృతి అని నిలదీశారు. విదేశాల నుంచి వచ్చిన బిగ్ బాస్ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. స్త్రీలను అవమానించేలా, వాళ్లు ఇబ్బంది పడేలా టాస్కులు, గేమ్స్ ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పరుచూరి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేసినట్లే కారు టాస్కుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. బిగ్ బాస్ పై ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. దీప్తి నల్లమోతు, శ్యామల పక్కనే ఉండగా తనీష్ మూత్ర విసర్జన చేయడం పెద్ద దుమారం రేపింది. అమ్మా అమ్మా అని పిలుస్తూ పక్కనే ఓ మహిళ ఉండగా అలా ఎలా చేస్తారని మహిళలను నిలదీస్తూ తనీష్ ను ఉతికారేస్తున్నారు. పైగా ఆ టాస్కులో దీప్తిని అత్యంత దారుణంగా నెట్టేయడానికి ప్రయత్నించడం, సామ్రాట్ కి చెప్పి శ్యామలను గెంటేయాలని చెప్పడం చూసిన ప్రేక్షకులు తనీష్ ని ఛీదరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పరుచూరి కామెంట్స్ తో తనీష్ పై ట్రోల్స్ మరింత పెరిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -