Monday, June 17, 2024
- Advertisement -

వారి గెలుపు భారతీయత గొప్పదనమా.. బ్రిటన్ గొప్పదనమా!

- Advertisement -

బ్రిటన్ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ విజయం దుందుభి మోగించింది. డేవిడ్ కామెరాన్ ప్రభుత్వం మరోసారి కొలువు దీరుతోంది. ఆయన ప్రధానిగామరో టర్మ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.

మరి ఇదే ఎన్నికల్లో భారతీయుల హవా కూడా కనిపిస్తోంది. ఓటర్లుగా పెద్ద సంఖ్య ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయగల శక్తులుగా నిలిచిన భారతీయులు.. పాలకులుగా కూడా ఎన్నికయ్యారు.
మొత్తం పదిమంది భారత సంతతి వారు ఎంపీలుగా ఎన్నికవ్వడం విశేషం. మొత్తం 650 మంది ఎంపీలలో మనవారు పది మంది ఉన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషిసునాక్ తో సహా మొత్తం పదిమంది ఎంపీలయ్యారు. ఆయన రిచ్ మండ్ యార్క్స్ నుంచి ఎంపీగా ఎన్నికవ్వగా… ఇంకా కీత్ వాజ్, వీరేంద్ర వాలెరీవాజ్ , నోవిస్ నాండీ, పృతి పటేల్, సీమా మల్హోత్రా… తదితరులు వివిధ నియోజకవర్గాల నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు.
మరి ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన దేశంలో ఏకంగా పదిమంది భారతీయులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం విశేషం. భారత్ బ్రిటన్ పాలనలో ఉన్నప్పుడే అక్కడికి వలస వెళ్లిన వారు.. ఆ తర్వాత ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన వారు.. అక్కడే సెటిలయిపోయి.. ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారు. మరి ఇది కేవలం ఎన్నికయిన వారి గొప్పదనమే కాదు.. వారిని ఆదరించిన ప్రజలది కూడా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -