Monday, May 6, 2024
- Advertisement -

సెనెటర్లుగా ఎన్నికైన చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్లు!

- Advertisement -

అమెరికా ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. అభ్యర్థుల మధ్య అధ్యక్ష పోరు పోటాపోటీగా సాగుతోంది. క్షణాల వ్యవధిలోనే అభ్యర్థుల ఆధిక్యం తారుమారు అవుతుండడం గమనార్హం. ఇక ప్రాథమిక ఫలితాల్లో ఉదయం 9గంటల సమయానికి(భారతీయ కాలమానం ప్రకారం) డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెరో 14 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు.

అయితే, ఎలక్టోరల్ ఓట్ల ప్రకారం ట్రంప్ కంటే బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని డెలావర్‌, వెర్మోంట్‌ల్లో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు సెనెటర్లుగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 30 ఏళ్ల సారా మెక్‌బ్రైడ్‌ డెలావర్‌ మొదటి టాన్స్‌ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 86శాతం ఓట్లను సాధించారు.

వెర్మోంట్‌లో నార్త్‌లో 26 ఏళ్ల టేలర్‌ స్మాల్‌ రాష్ట్రానికి మొదటి లింగమార్పిడి ప్రతినిధిగా గెలుపొందింది. రెండు జిల్లాల్లో ఆమె 43, 41శాతం చొప్పున ఓట్లు సాధించి, దేశంలో ఐదో ట్రాన్స్‌ సెనేటర్‌గా నిలిచింది. రాజకీయ కార్యాచరణ కమిటీ విక్టరీ ఫండ్‌ సెనేటర్‌గా గెలిచిన టేలర్‌స్మాల్‌, సారా మెక్‌బ్రైడ్‌ను అభినందించింది.

వెల వెలబోతున్న బంగారం.. అదే బాటలో వెండి!

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

బుద్ది మార్చుకోని అధికారి.. చెప్పుతో కొట్టిన బాధితులు!

90 గంటలు నరకం.. మృత్యువును జయించిన చిన్నారి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -