Saturday, May 10, 2025
- Advertisement -

జియో ఉన్నంత వ‌ర‌కూ ఫ్రీ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ముఖేష్ అంబాని…

- Advertisement -

మ‌రో సంచ‌ల‌నానికి జియో పునాది వేసింది. చాలా త‌క్కువ ధ‌ర కే 4జీ జియో ఫోన్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఫ్రీ ఇంట‌ర్నేట్‌ని అందించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్పుడు మోబైల్ రంగంలో మ‌రో సంచ‌లనానికి నాంది ప‌లికారు. చాలా త‌క్కువ రేటుకే జీయో ఫోన్ ను ప్ర‌క‌టించారు.
జియో ఫోన్ ప్ర‌త్కేక‌త‌లు

4జీ నెట్‌వ‌ర్క్ తో ప‌ని చేస్తుంది.
వాయిస్ కమాండ్ తో ఆప‌రేట్ చెయ్య‌వ‌చ్చు.
ప్రాంతీయ భాష‌ల‌లో స‌మాచారం పంప‌వ‌చ్చు.
జియో స్మార్ట్ ఫోన్ లో అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీ.
జియో ఫోన్ తో టివీకి క‌నేక్ట్ చేసుకోవ‌చ్చు.
22 భాష‌లు అందుబాటు.
హెచ్ డి వీడియోలు చూడ‌వ‌చ్చు.
స్వాతంత్య దినోత్స‌వం నుండి ఫోన్ అమ్మ‌కాలు ప్రారంభంం.

4జీ ఫోన్ ఉచితం కానీ సేక్యూరిటి కోసం 1500 కట్టాలి.1500 రూపాయలు 36 నెలల తరువాత తిరిగి ఇస్తారు.ఈఆఫ‌ర్ భార‌తీయుల‌కు మాత్ర‌మేన‌ని తెలిపారు.

దీనితో పాటు అంబానీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జియో ఉన్నంత వ‌రకు వాయిస్ కాల్స్ ఫ్రీ.. ఒక్క పైసా కూడా తీసుకోమ‌ని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు.

నెలకు 125 కోట్ల గిగాబైట్ల డేటాను తాము అందిస్తున్నామని, 65 కోట్ల వీడియో నిమిషాలను స్ట్రీమింగ్ చేస్తున్నామని ముఖేష్ పేర్కొన్నారు. మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను ఇండియా దాటేసిందని ప్రకటించేందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -