Thursday, April 25, 2024
- Advertisement -

300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ అరెస్ట్!

- Advertisement -

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.‘ఆంటిలియా’ బాంబు భయపెట్టే కేసులో, వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ హత్యకు పాల్పడినందుకు ముంబైలో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) గురువారం అరెస్ట్ చేసింది. జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీతో పాటు సీఆర్‌పీఎఫ్ అధికారులు కూడా ఇవాళ ఉద‌యం 5 గంట‌ల‌కు ప్ర‌దీప్ శ‌ర్మ ఇంటికి వెళ్లారు. ఈ కేసులో షీల‌ర్ అనే అనుమానితుడితో శ‌ర్మ గతంలో దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. షీల‌ర్ గ‌తంలో పోలీసు ఇన్‌ఫార్మ‌ర్‌గా చేసిన‌ట్లు ప్ర‌దీప్ తెలిపారు.

ఇదే కేసులో కస్ట‌డీలో ఉన్న మాజీ ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వాజేకు, శ‌ర్మ‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లు తేలింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పాపులర్ అయిన ప్రదీప్ శర్మను గతంలో రెండు సార్లు ఎన్ఐఏ విచారించింది. 1983 లో ముంబై పోలీసు శాఖలో ఎస్ఐగా జాయిన్ అయిన ఈయన ముంబై అండర్ వరల్డ్ కు సంబంధించి 300 కి పైగా ఎన్ కౌంటర్లు చేశాడట.. వీటిలో 113 ఎన్ కౌంటర్లు ఈయన పేరిటే ఉన్నాయి. 2019 లో సర్వీసు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న శర్మ.. శివసేన పార్టీలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాలా సోపర నియోజకవర్గం నుంచి ఇదే పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు.

ఈ కేసులో మరికొందరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈయనను అధికారులు అరెస్టు చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహ‌నంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శ‌ర్మ ద్వార‌నే తెప్పించిన‌ట్లు వాజే స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపార‌వేత్త మన్సుఖ్ హిరాన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన వాహనం గత ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రికి, సచిన్ వాజేకి మధ్య 100 కోట్ల వసూళ్ల వ్యవహారానికి సంబంధించిన వార్తలు హాట్ హాట్ టాపిక్ వార్తలుగా మారాయి.

పిల్లలపై వ్యాక్సిన్​ ప్రయోగాలు సక్సెస్​..!

నా భర్త మాటల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న: ప్రియమణి

సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి షాకింగ్ రియాక్షన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -