Friday, April 26, 2024
- Advertisement -

ముఖేష్ అంబానీ పిల్లల వాడే కార్ల గురించి తెలిస్తే ఔరా అంటారు!

- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవతుల జాబితాలో ముందంజలో ఉన్నాడు. ఇండియాలోనే కాదు, పశ్చిమాసియా మొత్తం మీద కూడా వీరే అత్యంత సంపన్నులు. లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ముఖేష్ అంబానీ పుత్ర రత్నాల వద్ద ఎలాంటి లగ్జరీ కార్లు గురించి తెలిస్తే ఔరా అంటారు. ముకేష్ అంబానీ మరియు నీతా అంబానీ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో కూతురు ఇషా అంబానీ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఇక ఆయన తనయులు సైతం వ్యాపార రంగంలో మునిగితేలుతున్నారు.

అయితే తండ్రిలాగే ఆయన తనయులకు కూడా కార్లు అంటే విపరీతమైన మోజు. నంత్, ఆకాశ్‌లు పలు లగ్జరీ కార్లలో ముంబై వీధుల్లో చక్కర్లుకొడుతుంటారు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారు లో చక్కర్లు కొడుతుంటారు. అదనపు ఫీచర్లు లేకుండానే దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 8.84 కోట్లుగా ఉంది.

ఇది గరిష్టంగా 454బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారులో 6.75-లీటర్ల కెపాసిటి గల వి12 ఇంజన్ కలదు. ఆకాశ్ అంబానీకి బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ కలర్ బెంట్లీ బెంట్యాగా ఎస్‌‌యూవీ కారు అంటే ఎంతో ఇష్టమట. భారత్ లో అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీలలో బెంట్లీ బెంట్యాగా మొదటి స్థానంలో ఉంది.

ఆకాశ్ అంబానీ ఖాతాలో ఉన్న మరో ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ వోగ్. అనంత్ మరియు ఆకాశ్ అన్నదమ్ములు అప్పుడు రేంజ్ రోవర్ వోగ్‌లో వెళుతుంటారు. ఒక్కో రేంజ్ రోవర్ వోగ్ ధర సుమారుగా రూ. 3.47 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇద్దరి వద్ద వేరు వేరు రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీలు ఉన్నాయి. మెర్సిడెస్ జి-క్లాస్ సిరీస్‌కు చెందిన జి63 ఏఎమ్‌జి వేరియంట్‌ను అనంత్ కలిగి ఉన్నాడు.

ఇక ప్రస్తుతం ముఖేష్ అంబాని మేబ్యాక్ 62 కెర్టాన్ కారును అధికారికంగా వినియోగిస్తున్నాడు. దీని ధర దాదాపుగా 5 కోట్లుగా ఉంది. ముఖేష్ అంబాని మేబ్యాక్ 62 మోడల్ కారుతో పాటుగా మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్, రోల్స్ రాయిస్ బెంట్లీ ప్లైయింగ్ హెచ్ ఫాంటమ్ స్పర్ మరికొన్ని లగ్జరీ కార్లు వినియోగిస్తున్నారు.

రసవత్తరంగా కొనసాగుతున్న పోలింగ్..!

నేటి పంచాంగం (06-04-2021)

తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -