Friday, May 17, 2024
- Advertisement -

చంద్రబాబు అనుకొన్నదొకటి.. అయ్యిందొకటి..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొన్నది ఒకటి.. చివరకు అయ్యింది ఒకటి.. విజయవాడలో భారీ ఎత్తున నిర్వహించాలని బాబుగారు భావించిన నవనిర్మాణ దీక్ష విషయంలో బాబు అంచనాలు తారుమారు అయ్యాయని వినికిడి.

ఈ ప్రొగ్రామ్ దారుణంగా ప్లాప్ కావడంతో బాబుకే కోపం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు సమాచారం ఇస్తున్నారు. 

జూన్ రెండును నవనిర్మాణ దీక్ష అంటూ సెలబ్రేట్ చేయబోయిన తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిందా? విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమం సూపర్ ప్లాఫ్ అయ్యింది? తెలంగాణలో జరిగిన పరిణామాలు బాబు యాత్రకు ఫెయిలవ్వడానికి కారణాలా? అనే సందేహాలు వినిపిస్తున్నాయిప్పుడు.  విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి రాష్ట్రాన్ని ఉద్దేశించి బాబుగారు చేపట్టిన ప్రోగ్రామ్ కాబట్టి దీనికి ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్ అయ్యుంటే సరిపోయేది.

అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడంతా ఓపిక లేకపోయింది. నిబంధనలకు విరుద్ధంగానే బాబు సభను బెంజ్ సర్కిల్ లో నిర్వహించారు. అయితే జనాలను తీసుకురావడంలో వారు పూర్తిగా విఫలం అయ్యారు. ఈ విషయంలో అధినేత స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనాలు తక్కువగా కనిపించడంతో బాబుకు కోపం వచ్చింది. దీంతో ఆయనే వారికి క్లాస్ పీకారు. మొన్ననే మహానాడు జరిగింది .. మళ్లీ వెంటనే సభ అంటే జన సమీకరణ కష్టం అయ్యిందంటూ నేతలు వివరణ ఇచ్చినా.. బాబు మాత్రం సమాధాన పడలేదు. ఇది తొలి తప్పు కాబట్టి.. సరిపోయింది. ఇకపై మాత్రం ఇలాంటి తప్పులను రిపీట్ చేయకండీ అంటూ అధినేత తెలుగుదేశంనేతలకు గట్టిగానే హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -