Friday, May 3, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి.. హీరోకు తక్కువ, కమెడియన్ కు ఎక్కువ!

- Advertisement -

ఇంతకు ముందు అంతా ఏమో కానీ… ఆ ఒక్క మాటతో కామెడియన్ స్థాయికి వచ్చేశాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ లో రెడ్లకు తనే ప్రతినిధిని అని చెప్పుకొంటూ వచ్చి..

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకొంటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ విషయంలో చేసిన వ్యాఖ్య విడ్డూరంగా ఉంది. తను సింహంలా వస్తున్నానని తెలిసి కేసీఆర్ చైనా పారిపోయాడని.. తను నియోజకవర్గం దాటుతున్న సమయంలో ఆయన విదేశాలకు వెళ్లిపోయాడని.. రేవంత్ అన్నాడు. ఏ మాత్రం లాజిక్ లేకుండా ఉన్న ఈ డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. రేవంత్ ఇలా చెప్పుకోవడం కామెడీగా మారింది.

కేసీఆర్ పై విమర్శలు చేయాలంటే.. విరుచుకుపడాలంటే అనే రకాలుగా విరుచుకుపడవచ్చు అంతే కానీ.. ఇలా తనను తాను సింహం అని చెప్పుకొంటూ.. విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తనకు భయపడే వెళ్లాడని చెప్పుకొంటూ రేవంత్ రెడ్డి కామెడియన్ అవతున్నాడు. ఒకవేళ కేసీఆర్ గనుక విదేశాలకు వెళ్లకుండా ఉంటే,.. రేవంత్ రెడ్డి ఇప్పుడేం చేసేవాడు? కేసీఆర్ ఇక్కడే ఉంటే..రేవంత్ ఆయన మీద పడి రక్కేవాడా? లేక ఇంకేమైనా చేసేవాడా? కేసీఆర్ ఏమీ శాశ్వతంగా చైనాకు వెళ్లిపోడు కదా.. ఆయన కూడా తిరిగి వస్తాడు కదా… అప్పుడు రేవంత్ ఆయనను ఏమైనా చేస్తాడేమో చూడాలి!

ఏదేమైనా ఇలాంటి డైలాగులు రేవంత్ కు ఆనందాన్ని ఇస్తాయేమో కానీ.. కాస్తంత ఆలోచన పరులు కూడా తెలుగుదేశం నేత మాటలను విని నవ్వుకొంటున్నారు. ఈయన హీరోకి తక్కువ కామెడియన్ కు ఎక్కువగా మారాడే అనుకొంటున్నారు! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -