Friday, May 10, 2024
- Advertisement -

వైఎస్ జగన్ కు ఇలాంటి ప్లాన్ లు చెప్పేది ఎవరో..!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా బాగానే పోరాడుతోంది. అధికారంపై బోలెడన్ని ఆశలతో ఎన్నికల బరిలోకి దిగి..

వచ్చిన షాకింగ్ రిజల్ట్స్ తో ప్రతిపక్షంలో కూర్చొన్న వైకాపా దాదాపుగా ఏడాది నుంచి రకరకాల పోరాటాలతో వార్తల్లోకి వస్తోంది. రైతు ల ఆత్మహత్యల వ్యవహారంలో అయితేనేమీ.. ఇతర వ్యవహారంలో అయితేనేమీ.. జగన్ మోహన్ రెడ్డి దీక్షలు, పరామర్శ యాత్రలతో అలా ముందుకుపోతున్నాడు. మరి ఇదంతా బాగానే ఉంది కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూలింగ్ విషయంలో మాత్రమే అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. సరిగా ప్లాన్ లేకుండా ముందుకు పోతోంది.

అసలు వైఎస్ జగన్ యాత్రలు.. దీక్షలు.. ఆయన పిలుపునిచ్చే బంద్ లకు సంబంధించి సరైన షెడ్యూల్ లేకుండా పోయింది. మొదటగా ప్రతిదానికీ ఒక డేట్ ను ప్రకటించడం … మళ్లీ ఆ తేదీని మార్చడం! ఇది వైకాపాకు రొటీన్ అయిపోయింది. ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం బంద్ అని ప్రకటించారు. ఆ విషయంలో తొలుత ఒక తేదీని ప్రకటించి.. ఆ తర్వాత తేదీని మార్చారు. వాయిదా తో ఆ విధంగా వైకాపా తన ప్రణాళిక లేమిని బయటపెట్టుకొంది. బంద్ విషయంలో ఢిల్లీ నుంచి ఒక తేదీని ప్రకటించి…దాన్ని వాయిదా వేశారు.

ఇప్పుడు జగన్ నిరవధిక నిరాహార దీక్ష విషయంలో కూడా అదే జరుగుతోంది. గుంటూరు వేదికగా జరిగే ఈ దీక్ష కు తొలుత ఈ నెల 15 ని ముహూర్తంగా నిలిచారు. ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేశారు. ఈ నెల 26 వ తేదీకి మార్చారు. గుంటూరు వేదికగానే ఈ నెల 26 న జగన్ దీక్షను చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. అదేమంటే.. వినాయకచవితిని దృష్టిలో పెట్టుకొని దీక్ష ముహూర్తాన్ని మార్చినట్టుగా వైకాపా వాళ్లు ప్రకటించారు. మరి మొదట తేదీని ప్రకటించినప్పుడు ఇలాంటి ఆటంకాలు వైకాపాకు తెలియవా?! అనేదే ఇక్కడ సందేహం. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఈ విషయంలో అలర్ట్ గా లేకుండా వ్యవహరిస్తుందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయిప్పుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -