Tuesday, May 14, 2024
- Advertisement -

టీవీ 9 లైవ్ షో లో అరస్ట్

- Advertisement -

టీవీ లైవ్ షో లలో భలే అద్భుతాలు జరుగుతూ ఉంటాయ్. లైవ్ షో లో ఇద్దరు ముగ్గుడు డిబేట్ చేసుకుంటూ ఉంటె రెచ్చిపోయి ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం లేదా కాల్ లో రెచ్చగొట్టిన వారిని బూతులు తిట్టడం అంతకంటే ఎక్కువగా స్టూడియో లోనే చొక్కాలు పట్టుకుని తన్నుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు పరిస్థితి తన్నుకోవడాలు , తిట్టుకోవడాలు నుంచి ఏకంగా పోలీసులు వచ్చి అరస్ట్ చేసే వరకూ వెళ్ళింది.

లైవ్ షో లో పోలీసులు టీవీ 9 కి ఒచ్చి నిందితుడ్ని అరస్ట్ చేసి తీసుకెళ్ళారు. మహేశ్ అలియాస్ డాకూరి (డెక్కల) బాబు! ఇతను ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులకు కంట్లో నలుసులా మారాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ.. బెదిరింపులకు – హత్యలకు కూడా తెగబడుతున్నాడు. ఇటీవల కాలంలో ఇలాంటి వాటిని అణిచేయాలని సీఎం కేసీఆర్ నుంచి గట్టి ఆదేశాలు అందడంతో వారం కిందట గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు అంతం చేసిన విషయం తెలిసిందే.

అయితే నయీం రేంజ్ లో కాకపోయినా.. తన స్థాయికి తను ఇలాంటివే చేస్తున్న డెక్కలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. డెక్కల పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ వివాదంలో శివరాజ్ యాదవ్ ను హత్య చేసి – ఆపై కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపి పోలీసులకు చిక్కకుండా చిక్కడు దొరకడు రేంజ్ లో పోలీసులతో ఆడుకుంటున్నాడు  డాకూర్ బాబు. అయితే మనోడికి మీడియా ముందుకు రావడం అంటే భలే మజా! అందునా.. లైవ్ షో అంటే మరీ క్రేజ్!! ఇది చూసిన పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అరస్ట్ చేసేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -