Wednesday, May 22, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా ధ‌రించిన చెప్పుల ఖ‌రీదు ఎంతో తెలుసా…?

- Advertisement -

సెల‌బ్రిటీలు ఏం చేసినా అది వైర‌ల్ అవ‌డం స‌హ‌జ‌మే. ఎందుకంటే అది వాల్ల స్టేట‌స్‌ను తెలియ జేస్తుంది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచింది. బ్రిటన్‌ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్‌ మార్కల్‌(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్‌ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్‌ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ప్రియాంక ఈ వేడుకలో స్పెషల్‌ అ‍ట్రాక్షన్‌గా నిలిచారు.

బ్రిటన్‌ మహారాణి ఇంట జరుగుతున్న వివాహం కాబట్టి దానికి తగ్గట్టే ప్రియాంక కూడా రాయల్‌ లుక్‌లో ఆమె అదిరిపోయారు. డ్రస్‌ నుంచి ఆమె వేసుకున్న హీల్స్‌ వరకు ప్రతీది ఆకట్టుకునే రీతిలోనే ఉన్నాయి. ఆమె ధ‌రించిన హీల్స్ ఖ‌రీదు వింటే షాక్ అవుతారు. అమె ధ‌రించిన హీల్స్ ఖ‌రీదు అక్ష‌రాలా రూ.1.35 లక్షలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -