Saturday, May 4, 2024
- Advertisement -

పిచ్చెక్కి కొట్టుకునే వాళ్లకు ఆ ఫోన్ వచ్చేసింది

- Advertisement -

ఐ ఫోన్ . యావత్ ప్రపంచానికి.. మరీ ముఖ్యంగా గాడ్జెట్ లవర్స్ ఆరధ్య స్మార్ట్ ఫోన్ దేవత. ఇది కాకుండా ఏది కొన్నా… తమ స్టేటస్ పోయినట్లే అని ఫీలైపోయే వారు ఎక్కువ కాబట్టి…ఐఫోన్ ను ఎవరు వదిలిపెట్టడం లేదు. ఐఫోన్ ను క్రాస్ చేసే విధంగా ఎన్నో ఫోన్ లు వచ్చినా…ఐఫోన్ అంటే ఉండే బ్రాండ్ జనాల మెదళ్లలోకి వెళ్లిపోయింది . తాజాగా ఐఫోన్ తన లేటెస్ట్ ఫోన్ … ఎక్స్ ను మార్కెట్లోకి తెచ్చేసింది. దీని కోసం అమెరికన్ జనాభా వెర్రితలలు వేస్తుంది. గాడ్జెట్ దునియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా… ఐఫోన్ మేనియానే.

సెప్టెంబర్ 12న ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మోడళ్లను మార్కెట్లో పెడుతూ.. పనిలోపనిగా ‘ఐఫోన్ టెన్త్ యానివర్సరీ’ సందర్భంగా ఐఫోన్ X ని కూడా అనౌన్స్ చేశాడు యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. అప్పుడు మొదలైంది.. ఐఫోన్ పిచ్చి..ఇదిగో ఫొటోల్లో చూస్తున్నారు కదా.. . జనాలు ఎలా పడికొట్టుకుంటున్నారో. న్యూజెర్సీలోని మెన్లో పార్క్ మాల్ లో ఐఫోన్ ఎక్స్ కోసం ఉదయం 5 నుంచే క్యూల్లో నిలబడి పడిగాపులు పడుతున్నారు జనాలు. ఇదే క్లచర్ ను మనం చైనా ,జపాన్ లో కూడా చూస్తూ ఉంటాం. చివరికి ఈ పిచ్చి ఎక్కడ వరకు పోయిందంటే… శాన్‌ఫ్రాన్సిస్కో యాపిల్‌ స్టోర్‌ దగ్గర 2కోట్ల విలువైన ఐఫోన్లు చోరీకి కూడా గురయ్యాయి. డెలివరీ సంస్థ ‘యూపీఎస్‌ 313’ ఫోన్ల ట్రక్కును స్టోర్ వద్దకు తీసుకురాగానే ముగ్గురు ఆగంతకులు మాస్కులేసుకుని ట్రక్‌ డ్రైవర్‌ ని చితకబాది 3 వందల ఐఫోన్లను ఎత్తుకెళ్లారంటే వీరి ఐఫోన్ పిచ్చి ఎంతటి పీక్స్ కు పోయిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ దొంగలకు తెలియని విషయం.. కొత్త ఫోన్లకు ‘తెఫ్ట్ ఫ్రీ’ టెక్నాలజీ ఉందన్న విషయం తెలియకపోవడం. సో వీరు తస్కరించి ఫోన్లను కనీసం వారు ఆపరేట్ కూడా చేయలేరు.

ఇక మన ఇండియాతో పాటు 55 దేశాల్లో ఐఫోన్‌ ఎక్స్ అమ్మకాలు మొదలయ్యాయి. గత శుక్రవారం ప్రీ-ఆర్డర్లు పెడితే.. క్షణాల వ్యవధిలో ‘అవుట్ ఆఫ్ స్టాక్‌’ బోర్డులు వెలిశాయి.అమెరికాలో ఐఫోన్ X ధర 990 డాలర్లు. 250 జీబీ అయితే 1150 డాలర్లు. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ X ప్రారంభ ధర 89వేలు. 64జీబీ 89 వేలు, 256జీబీ ధర లక్షా 2 వేలు. జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు ఐఫోన్ X మీద క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను కూడా ఇచ్చేశాయి. ఎంతైనా ఐఫోన్ క్రేజే క్రేజు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -