Saturday, April 27, 2024
- Advertisement -

సాక్షి ఏం మారలా? తాను బుక్కవ్వడంతో పాటు జగన్‌ని కూడా బుక్ చేస్తోంది

- Advertisement -

ఈనాడు, ఆంధ్రజ్యోతిలు పరోక్షంగా చంద్రబాబు మీడియా సంస్థలు. అయినప్పటికీ బాబుకు ప్రయోజనం చేకూర్చే రాతలతో చంద్రబాబును అద్భుతమైన, అవినీతి అంటని నాయకుడిగా నిలబెట్టడానికి ఎంతలా ప్రయత్నిస్తాయో……బాబుకు నష్టం చేకూర్చే రాతలను మాత్రం అంతలా అవాయిడ్ చేస్తాయి. పరోక్షంగా బాబు మీడియా సంస్థలు అయిన పచ్చ మీడియా సంస్థలే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు డైరెక్ట్‌గా జగన్ మీడియా అని అందరికీ తెలిసిన సాక్షి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ సాక్షి మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం అస్సలు చేయడం లేదు. అన్ బయాస్డ్ న్యూస్ అందించడంలో సాక్షి మీడియా ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలకంటే మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని సిల్లీ మిస్టేక్స్‌తో పాటు నీరసమైన రచనా శైలి కూడా సాక్షి పత్రికపై ఆసక్తి తగ్గేలా చేస్తోంది.

తాజాగా యాంకర్ ప్రదీప్ మీడియాకు ఇచ్చిన వీడియో విషయంలో సాక్షి చేసిన తప్పు సాక్షి వార్తల విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉంది. ఆ వీడియోలో ప్రదీప్ చెప్పిన ఇతర విషయాలను పక్కన పెడితే ……‘లాస్ట్ ఇయర్ నేను కొన్ని విషయాలు చెప్పాను……కానీ దురదృష్టవశాత్తూ వాటిని నేనే ఉల్లంఘిస్తూ దొరికిపోయాను’ అన్న తరహాలో ప్రదీప్ మాచిరాజు చెప్పాడు. కానీ సాక్షి మీడియా మాత్రం పెప్ కోసం చేశారో, లేక పొరపాటుగా రాశారో కానీ తప్పు చేయడం గురించి పశ్ఛాత్తాపపడడం కంటే కూడా దురదృష్టవశాత్తూ దొరికిపోయాను అని ప్రదీప్ మాచిరాజు చెప్పినట్టుగా వార్త రాసుకొచ్చారు. నిజానికి ప్రదీప్ చెప్పిన మాటలలో ఎక్కడా ఆ భావం కనిపించదు. ప్రదీప్ మాచిరాజు వీడియో చూసిన ఎవరికైనా ఆ విషయం అర్థం అవుతుంది. కానీ సాక్షి వారికి మాత్రం ఆ వీడియోను కాస్త పరిశీలనగా చూసే ఓపిక లేకుండాపోయినట్టుంది. వీడియోలో ఉన్న వార్తను ఉన్నదున్నట్టుగా అందించడంలో సాక్షి ఫెయిల్ అయిందన్న అపవాదు తెచ్చుకుంది. అన్నింటికీ మించి ప్రభాస్ ఇష్యూతో ఎన్నికలకు ముందు జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆ తర్వాత రాజులందరిలోనూ జగన్‌పై అనుమానాలు క్రియేట్ అయ్యేలా పచ్చ మీడియా మొత్తం అబద్ధాలు, అభూత కల్పనలతో కథలు అల్లి కొన్ని ఓట్లను అయినా ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు వార్త విషయంలో సాక్షి వార్తను పట్టుకుని మరోసారి అలాంటి విషప్రచారాన్ని టిడిపి గ్యాంగ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో షురూ చేసింది. సాక్షిమీడియా జగన్‌కి ఎంత ప్రయోజనం చేకూరుస్తుంది అన్న విషయం పక్కన పెడితే ఇలాంటి తప్పులతో తన విశ్వసనీయతను పోగొట్టుకోవడంతో పాటు జగన్‌కి కూడా మైనస్ అయ్యేలా చేస్తోందన్నది మాత్రం నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -