Monday, April 29, 2024
- Advertisement -

డీవిలియ‌ర్స్ అర్థ శ‌త‌కం… నిల‌క‌డ‌గా ఆడుతున్న సౌతాఫ్రికా….లంచ్ విరామ స‌మ‌యానికి..107/3

- Advertisement -

భారత్‌తో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ అర్ధ‌శ‌త‌కం సాధించారు. ప్ర‌స్తుతం టౌన్ వేదిక‌గా భార‌త్ తో జ‌రుగుతున్న తొలిటెస్టులో లంచ్ విరామానికి సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 107 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం డివిలియ‌ర్స్ (59), డ్లూపెసిస్ (37) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

గత ఏడాదన్నరకాలంగా వెన్నునొప్పితో టెస్టులకి దూరంగా ఉన్న ఏబీ.. ఇటీవల జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో మళ్లీ పునరాగమనం చేశాడు. ఆ టెస్టులో విఫలమైనా.. తాజాగా భారత్‌పై హాఫ్ సెంచరీతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డుని నడిపిస్తున్నాడు.

ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి మ్యాచ్ ఆరంభంలోనే 12/3తో సఫారీ జట్టు ఒత్తిడిలో పడగా.. ఈ దశలో సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఏబీ డివిలియర్స్ నాలుగో వికెట్‌కి కెప్టెన్ డుప్లెసిస్‌ (37) ) కలిసి 85 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాడు.

దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్‌ మక్రమ్‌(5) అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లను భువనేశ్వర్‌ కుమార్‌ సాధించి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వేసి తొలి ఓవర్‌ మూడో బంతికే ఎల్గర్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వెళుతున్న బంతిని హిట్‌ చేయబోయి కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

అటు తరువాత భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతికి మక్రమ్‌ ఎల్బీగా అవుటయ్యాడు.కాగా, భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఐదో ఓవర్‌ ఐదో బంతికి హషీమ్‌ ఆమ్లా(3) పెవిలియన్‌కు చేరాడు. కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌ గా అవుటయ్యాడు

దీంతో లంచ్ విరామ‌ సమయానికి దక్షిణాఫ్రికా 26 ఓవ‌ర్ల‌కు 107/3తో నిలిచింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్న డివిలియర్స్.. మరో పేసర్ మహ్మద్ షమీని లక్ష్యంగా చేసుకుని వరుసగా బౌండరీలు బాదేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -