Friday, May 10, 2024
- Advertisement -

సంపూర్ణేష్ బాబు ని చూసి నేర్చుకోవాలి

- Advertisement -

సంపూర్ణేష్ బాబు హీరో గా ఇటీవలే విడుదల అయిన సినిమా కొబ్బరి మట్ట. అయితే సంపూర్ణేష్ బాబు పెద్ద హీరో ఏమి కాదు కానీ సహాయం చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు మాత్రం అందరికన్నా ముందు ఉండి సహాయం చేస్తూ ఉంటాడు సంపూర్ణేష్. సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న వాడే ఇంత చేస్తూ ఉంటె, పెద్ద హీరోలు ఇంకెంత చేయాలి అనే డిబేట్ ఎప్పుడూ వస్తుంది. అయితే ఇప్పుడు సంపూర్ణేష్ బాబు కర్ణాటక లో వస్తున్న వరద ల సహాయ చర్యలకి రెండు లక్షల రూపాయలు విరాళం ప్రకటించాడు.

ఉత్తర కర్ణాటక లో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను.#KarnatakaFloods” అని సంపూర్ణేష్ బాబు తన ట్విట్టర్ ప్రొఫైల్ లో షేర్ చేసాడు.

సంపూర్ణేష్ బాబు పెద్ద కోటీశ్వరుడు ఏమి కాదు కానీ ఆపదలు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళకి సహాయం చేయడం లో సంపూర్ణేష్ బాబు ఎప్పుడూ ముందే ఉంటాడు అని మరో సారి రుజువు అయింది. ఇకపోతే సంపూర్ణేష్ నటించిన సినిమా కొబ్బరి మట్ట ప్రస్తుతం విజయవంతం గా థియేటర్ల లో నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -