Saturday, April 20, 2024
- Advertisement -

జనవరి 27న చిన్నమ్మ విడుదల.. జరిమానా ఎంతంటే..!

- Advertisement -

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ జనవరి 27న ఉదయం జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తవుతున్నందున ఆమె విడుదలవుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని శశికళ న్యాయవాది రాజా సెంథూర్​ పాండ్యన్​కు తెలియజేేశారు.

జైలు అధికారుల నుంచి శశికళ విడుదలకు సంబంధించిన సమాచారం అందిందని రాజా సెంథూర్ పాండ్యన్ వెల్లడించారు.అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -