Monday, May 6, 2024
- Advertisement -

శాటిలైట్​ యోగాన్​-33 విజయం.. చైనా ప్రకటన..!

- Advertisement -

రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్​ యోగాన్​-33 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. పశ్చిమ చైనాలోని జియాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం రాత్రి రెండు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్నాయని వెల్లడించింది.

యోగాన్​-33తో పాటు.. అంతరిక్షంలో మైక్రో, నానో సాంకేతిక ప్రయోగాలకు ఉద్దేశించిన మరో ఉపగ్రహాన్ని లాంగ్​మార్చ్-4సీ రాకెట్​ ద్వారా ప్రయోగించినట్టు శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. లాంగ్​ మార్చ్ సిరీస్​లో ఇది 375వ ప్రయోగం.

శాస్త్ర, సాంకేతిక రంగ పరిశోధనలతో పాటు.. భూ సర్వే, పంట దిగుబడుల అంచనా, విపత్తుల నివారణకు ఈ రెండు ఉపగ్రహాలు తోడ్పడతాయని చైనా తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -