- Advertisement -
మీ దగ్గర ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? తరచూ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూసే. నగదు రహిత, డిజిటల్ లావాదేవీలు పెంచడమే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం అమల్లోకి రానుంది. ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 20 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.గతంలో ప్రకటించిన ఈ కొత్త పరిమితి నిబంధన రేపు అనగా అక్టోబర్ 31 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.
ఏటీఎంలో రూ.20,000 కన్నా ఎక్కువ డ్రా చేసుకోలేరు. ఇంతకుముందు ఈ లిమిట్ రూ.40,000 ఉండేది. రోజూ రూ.40,000 వరకు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశముండేది. అయితే ఇటీవల ఏటీఎంల దగ్గర మోసాలు పెరిగిపోతున్నాయన్న ఫిర్యాదులు, మరోవైపు ప్రజలు డిజిటల్, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అలవాటు చేసుకోవాలన్న కారణాలతో విత్‌డ్రా లిమిట్ తగ్గించినట్టు చెబుతోంది ఎస్‌బీఐ.