Saturday, April 27, 2024
- Advertisement -

ఎస్ బీ ఐ కష్టమర్లకు షాక్….త్వరలో కనుమరుగు కానున్న డెబిట్ కార్డులు….

- Advertisement -

ప్రపంచం అంతా డిజిటల్ వైపు పరగులు పెడుతోంది. లావేదీవీలన్నీ ఇప్పుడు డిజిటల్ ద్వారా జరుగుతున్నాయి. నోట్లు రద్దు తర్వాత భారత్ లో కూడా డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. తాజాగా ఎస్ బీఐ కూడా తమ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. త్వరలోనె అన్ని డెబిట్ కార్డులను రద్దు చేయనుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకొంటోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 90 కోట్ల డెబిట్ కార్డులు, 3 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ తెలిపారు. డెబిట్ కార్డులు లేని వ్యవస్థ కోసం యోనో యాప్ వంటి సేవలు దోహదపడతాయని తెలిపారు. యోనో యాప్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని కుమార్ తెలిపారు. వ్యాపారులు కూడా డెబిట్ కార్డులేకుండానె లావా దేవీలను నిర్వహించుకోవచ్చు. బ్యాంక్ ఇప్పటికే 68,000 యోనో క్యాష్‌పాయింట్లను ఏర్పాటు చేసిందని కుమార్ తెలిపారు. ఈ సంఖ్యకు 10 లక్షలకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.వచ్చే 18 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్లాస్టిక్ డెబిట్ కార్డుల వినియోగం దాదాపు తగ్గించేందుకు ఎస్ బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -