Sunday, May 19, 2024
- Advertisement -

రెండో రోజు లాభాల‌తో దూసుకెల్లిన స్టాక్ మార్కెట్లు..

- Advertisement -

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో కూడా జోరును కొనసాగించాయి. రూపాయి బలపడటం, ఆయిల్‌ ధరలు కరెక్షన్‌కు గురవడంతో పాటు అంత‌ర్జాతీయంగా సానుకూల‌త‌లు ఉండ‌టంతో రెండో రోజు మార్కెట్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ఆద్యంతం సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 262 పాయింట్లు పుంజుకుని 34,925కు చేరుకుంది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 10,605కి ఎగబాకింది.

నేటి మార్కెట్‌లో అన్ని రంగాల షేర్లు గ్రీన్‌గానే ట్రేడయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు లాభాల బాట కొనసాగించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
గేట్ వే డిస్ట్రిపార్క్స్ (19.99%), టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (14.56%), ఎంసీఎక్స్ (13.79%), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (11.87%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటా (9.30%).

టాప్ లూజర్స్:
గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ (-4.39%), శోభా లిమిటెడ్ (-3.98%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-3.46%), జీఈ టీ అండ్ డీ ఇండియా (-3.14%), ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (-3.13%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -