Wednesday, May 15, 2024
- Advertisement -

ఆత్మహత్య చేసుకుంటా – హీరో శివాజీ

- Advertisement -

ఏపీ కి ప్రత్యేక హోదా విషయం లో నటుడు శివాజీ ఇప్పటికే చాలా చేసారు. చురుగ్గా మాట్లాడ్డం తెలిసిన ఆయన ఇప్పుడు ప్రత్యెక హోదా విషయం లో సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామ చంద్రరావు ప్రవేశ పెట్టిన బిల్లు మీద ఓటింగ్ జరగబోతూ ఉండడం తో శివాజీ మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు తో సహా అందరినీ ఏకి పారేసారు ఆయన, తమ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లు తీర్చుకోవడం తమ హక్కు అనీ దీనికోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తీరుతాం అని ఆయన అంటున్నారు.

కానీ ఏపీ  ఎంపీలని చేతకాని వారుగా ఆయన అభివర్ణించారు ” తెలంగాణా ఎంపీలని చూసి మనవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ” అన్నారు ఆయన. ఏపీ కి ప్రత్యేక హోదా రావాలి అంటే అందరూ పోరాడాలి అని చెబుతున్న ఆయన. చంద్రబాబు గారు విమానాలు వేసుకుని తిరిగితే పెట్టుబడులు, పరిశ్రమ లూ రావు అనీ ప్రత్యేక హోదా వలన మాత్రమే ఇది సాధ్యం అనీ అంటున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబుబుకు మరో విషయం చెబుతున్నా. హోదా విషయంలో ప్యాకేజీలతో సర్దుకుపోవాలని చూస్తే.. డైరెక్ట్ గా మీ ఇంటి ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. వింటున్నారా సార్. మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాను. చరిత్ర హీనులవుతారా? చరిత్ర పురుషులవుతారా? మీరే డిసైడ్ చేసుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -