Monday, May 13, 2024
- Advertisement -

బ్రేకింగ్ : లీక్ అయిపోయిన కబాలి సినిమా – ఆన్ లైన్ లో వచ్చేసింది

- Advertisement -

పైరసీ దెబ్బలకి ఇండస్ట్రీ లు వణుకుతున్నాయి. ఆ సినిమా ఈ సినిమా అనే తేడా లేదు, ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనే బేధం అసలే లేదు. ప్రొడ్యూసర్ ల చేత మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాయి ఈ సినిమాలు. సినిమా థియేటర్ లోకి రాక ముందరే నేట్టింట్లోకి వచ్చేసి నానా భీబత్సం చేస్తున్నాయి. ఇప్పటికే ఉడతా పంజాబ్ మొదలు గ్రాండ్ మస్తీ , సుల్తాన్ వరకూ ఆ హీరో ఈ హీరో అని లేకుండా అందరి సినిమాలూ విడుదల అయ్యి ఆన్ లైన్ లో సంచలనం రేపాయి.

ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న కబాలి కూడా ఆన్ లైన్ లో విడుదల అయ్యింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ కి ఇంకా ప్రచారం కల్పించడం ఇష్టం లేక అందరూ సైలెంట్ గా ఉన్నారు అనీ ముఖ్యంగా ప్రొడ్యూసర్ లు ఏదైనా ప్రెస్ నోట్ ఇస్తే ఇంకా ప్రచారం లభిస్తుంది అని మిన్నకుండిపోయారు అని చెబుతున్నారు. నిర్మాతలు కూడా ఆచి తూచి స్పందిస్తున్నారు.

ఆన్ లైన్ లో కొన్ని లింకులు ఉండగా వాటిని తొలగించే పనిలో ఉన్నాం అంటున్నారు వారు. అయితే లీకైన కబాలి సినిమాను మామూలు ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా చూడటం కాని డౌనులోడ్ చేయడం కాని కుదరట. కేవలం డార్క్ వెబ్ అనే ప్రక్రియ ద్వారా ప్రత్యేక యాప్స్ ద్వారా చూడ్డానికి మాత్రమే వీలుపడుతుందట. అందువలన.. కామన్ మ్యాన్ కు ఈ ప్రింటు చేరేలోపు సైబర్ క్రయిమ్ వారు దీనిని తొలగించడానికి చాలా స్కోప్ ఉంది.

Related

  1. అందరికంటే ముందే కబాలి సినిమాని చూసింది ఎవరో తెలుసా?
  2. రెండు గంటల్లో కబాలి టికెట్ లు ఓవర్
  3. కబాలి కోసం ఫ్లైట్ .. ప్రపంచం లో మొట్ట మొదటి సరిగా ..
  4. విమానాలపై కబాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -